శ్రీ దాసరి రాజారావు కుటుంబానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. లక్ష ఆర్ధిక సాయం


ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ని
యోజకవర్గం ధర్మాజీగూడెం ప్రాంతానికి చెందిన కౌలు రైతు శ్రీ దాసరి రాజారావు ఆర్థిక ఇబ్బందులతో మూడేళ్ల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారు.


జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పార్టీ
అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధర్మాజీగూడెంలో శ్రీ రాజారావు కుటుంబాన్ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. శ్రీ రాజారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జనసేన పార్టీ తరఫున ప్రకటించిన రూ. లక్ష ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో ఆయన తల్లిదండ్రులు శ్రీమతి మరియమ్మ, శ్రీ సుశీలకు అందజేశారు. శ్రీ రాజారావు కుమారుడు శ్రీ అఖిల్ విద్య బాధ్యతలను జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పీఏసీ సభ్యులు శ్రీ నాగబాబు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, పార్టీ నాయకులు శ్రీమతి ఘంటసాల వెంకట లక్ష్మీ, శ్రీ బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.