మావోయిస్టు లు మల్లి రెచ్చిపోయారు ..అర్ద రాత్రి ప్రయాణికులతో వెళుతున్న బస్సు ను ఆపి,,తగలబెట్టారు,,, తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు ఏజన్సీలో ఓ బస్సుకు నిప్పంటించారు. కొత్తూరు జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవేటు బస్సును మావోలు దగ్ధం చేశారు.
దండకారణ్యం బంద్ పాటించాలని కోరుతూ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.అర్ధరాత్రి 12 గంటలకు కొత్తూరు వద్ద మావోయిస్టులు బస్సును అడ్డగించి ప్రయాణికులను కిందకు దించి బస్సుపై డీజిల్ పోసి తగలబెట్టారు. ప్రయాణికులు భయాందోళనకు గురై సర్వేల గ్రామంలో కొంతమంది ఇళ్లలో తలదాచుకొని ఈరోజు ఉదయం చింతూరు చేరుకున్నారు.
ఈ ఘటనలో కొంతమంది ప్రయాణీకులకు గాయాలు అవ్వడంతో చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన చింతూరు పోలీసులు, విచారణ చేపట్టారు.