విక్రమ్ 'కోబ్రా' ధీరా ధీరాధి ధీరా... రెహ్మాన్ సాంగ్

 


'కోబ్రా' యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో విక్రమ్ అనేక గెటప్పులలో కనిపించనున్నాడు. ఒక కథలో భాగంగా ఆయన ఇన్నిరకాల గెటప్పులు ధరించడం ఇదే మొదటిసారి. ప్రతి గెటప్పు వెనుక ఒక ఆసక్తికరమైన ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 
  
లతీఫ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించగా, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు. 'ధీరా ధీరాధి ధీరా .. అధీరా' అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, మియా జార్జ్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. మే 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.