జనసేన పార్టీని మీ బిడ్డల్ని ఆశీర్వదించండి - ఆదరించండి.
దేవనకొండ మండలం పీ. కోటకొండ, దుప్పనగుర్తి గ్రామాల్లో పర్యటించిన ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ తెర్నెకల్ వెంకప్ప. అక్కడున్న ప్రజలతో మమేకమై వైసీపీ వైఫల్యాలు కుడి చేత్తో ఇచ్చి, ఎడమ చేత్తో తీసుకోవడం. నిత్యావసర సరుకుల పైన, విద్యుత్తు, చెత్త పనులు, ధరలు కనీసం 10-20% అదనపుగా (పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే) ఇలా వైసీపీ వైఫల్యాలు చర్చిస్తూ, 2024 జనసేనకి పట్టం కట్టాలని కోరారు. జనసేన షణ్ముఖ వ్యూహాలు(ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కోసం) ప్రజలకు వివరించారు.
అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల ఆత్మహత్యలు ( రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 353 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు)
చేసుకున్న వారికీ అండగా ఉండేందుకు రూ. 5 కోట్ల రూపాయలు కేటాయించి జనసేన పార్టీ తరఫున ప్రతి కుటుంబాన్ని పరామర్శించి త్వరలోనే అందజేస్తారు. జనసేన పార్టీ ఎల్లప్పుడు ప్రజలకు అండగా ఉంటుంది. అధికారం వచ్చిన తర్వాత చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పమని వివరించారు.