ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా చింతలపూడి నియోజవర్గం మట్టంగూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు శ్రీ కాకొల్లు బాబురావు కుటుంబాన్ని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. శ్రీ బాబురావు వ్యవసాయంలో తీవ్ర నష్టాలు రావడంతో అప్పులపాలై ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శ్రీ బాబురావు మరణం తరువాత తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్య శ్రీ వెంకటేశ్వరమ్మకు అందజేశారు.
ఈ సందర్భంగా కుమార్తెలు ముగ్గురినీ పలకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి చదువుల గురించి ఆరా తీశారు. బిడ్డల చదువులకు ఎటువంటి ఆటకం ఏర్పడకుండా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ. 7 లక్షల నష్టపరిహారం అందేలా అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.