ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పొన ఆర్థిక సాయం అందజేశారు. కైలు రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.వైసీపీ అంటే నాకు ద్వేషం లేదన్నారు. కన్నీళ్లు తుడుస్తానని చెప్పి చేయకపోతే గట్టిగా అడుగుతామన్నారు.
ప్రజల కన్నీళ్లు తుడవకపోతే గ్రామ సచివాలయాలు ఎందుకు అన్నారు. జనసేన ప్రశ్నిస్తే తప్ప సమస్యలు తెలియవా అని అన్నారు. తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ దూషించనని స్పష్టం చేశారు. చంచల్ గూడలో షటిల్ ఆడుకున్న మీరు మాకు చెప్తారా అని అన్నారు.ప్రశ్నిస్తే నన్ను దత్తపుత్రుడు అంటారా? అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కాబట్టి మీరు అనే మాట్లాడుతున్నా..ఇంకోసారి దత్తపుత్రుడు అని అంటే.. సీబీఐకి దత్తపుత్రుడని అంటామని తెలిపారు. నేనెవ్వరికీ దత్తత వెళ్లను.. నన్నెవరూ భరించలేరని చెప్పారు.99 సార్లు శాంతియుతంగా ప్రవర్తిస్తానని, అలాగే విర్రవీగితే తాను ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసన్నారు.
జనసేన సైనికుల మీద దాడులు చేస్తే.. మర్యాదగా ఉండదని హెచ్చరించారుప్రజలు సమస్యలు తీర్చని గ్రామ సచివాలయాలు ఎందుకు ? జనసేన ఎత్తుకుంటే గానీ మీకు సమస్య గుర్తురాదా ? అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మూడు వేల మంది కౌలు రైతులు చనిపోయారని తెలిపారు. 80 శాతం కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించకపోయినా.. తమ పార్టీ గుర్తిస్తుందన్నారు. కౌలు రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ? అని ప్రశ్నించారు. సమస్యలపై మాట్లాడితే.. తనను దత్తపుత్రుడు అని అంటున్నారని పేర్కొన్నారు. సీబీఐ దత్తపుత్రుడు మాట్లాడే మాటలను పట్టించుకోవాల్సినవసరం లేదన్నారు. దత్తత అని ఎందుకు వస్తుంది ? అని సెటైర్ వేశారు.