భారత్‌ను తాకిన యుద్ధం సెగ..


పెట్రోల్‌, డీజిల్ ధరలు 
భారీగా పెంచుతుందన్న కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా దోపిడీ మొదలుపెట్టేశారు కొందరు పెట్రోల్‌ బంక్‌ యాజమానులు. పెట్రోల్‌, డీజిల్‌ స్టాక్‌ లేదంటూ మాయ చేస్తున్నారు. స్టాక్‌ లేదని చెబుతూ పెట్రోల్‌, డీజిల్‌ను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఈ పరిస్థితి కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కనిపించింది. పెట్రోల్‌ బంక్‌ల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టకుండానే స్టాక్‌ లేదని చెబుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు యజమానులు. దాంతో పెట్రోల్‌ బంక్‌ల వద్ద ప్రజలు పడిగాపులు పడుతున్నారు. బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు.

5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్‌ ఇవాల్టితో ముగుస్తుంది. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్‌ రేట్స్‌ పెరిగే ఛాన్సుందని అంటున్నారు నిపుణులు. ఇదే జరిగితే సామాన్యుని జేబుకు చిల్లుపడటం ఖాయమంటున్నారు