దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానో..పరోక్షంగానే పన్ను కడుతుంటారు. దుకాణంలోనే కొనే వస్తువుల నుంచి రెస్టారెంట్ లో భోజనం చేయడం వరకు పరోక్ష పన్నులు కడుతుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తుంటాయి.
ఆదాయ పన్ను కావచ్చు.. ప్రత్యక్ష పన్నులు కావచ్చు. స్థానిక ప్రభుత్వాలైన నగర పాలక సంస్థ, మున్సిపాల్టీలు, పంచాయతీలు కూడా కొన్ని పనులు వసూలు చేస్తాయి.ఇంటి పన్ను, కుళాయి, చెత్త .. ఇలా కొన్ని రకాలైన పన్నులు వసూలు చేస్తుంటాయి. కొంతమంది ఈ పన్నులు కట్టరు. దీంతో వారికి వారికి వడ్డీ వేసి వసూలు చేస్తుంటారు. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా.. పన్నులు వసూలు చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.
పన్నులు కట్టకపోతే ఇంట్లోని వస్తువులు జప్తు చేస్తామనే హెచ్చరికలు జారీ చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పన్నుల వసూలు కోసం తూర్పు గోదావరి జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. పన్నులు కట్టకపోతే వడ్దీ వ్యాపారుల తరహాలో ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పన్ను బకాయిలు చెల్లించని వారి సామాన్లు జప్తు చేస్తామంటూ ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేయడంపై మొన్నీమధ్య కాకినాడలో వివాదం రాజుకోగా తాజాగా ఇప్పుడు అదే జిల్లాలోని పిఠాపురంలో మరో ఘటన చోటు చేసుకుంది.