వైసీపీ మీదతూటాలు పేల్చడానికి జనసేనాని రెడీ..


కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
ఏపీలోని పదమూడు జిల్లాల్లో ఎక్కడికక్కడ పార్టీలో కొత్త ఉత్సాహం వెల్లి విరుస్తోంది. గుంటూరు జిల్లాలో ఈసారి జరిగే పార్టీ వార్షికోత్సవలకు దాదాపుగా లక్ష మంది దాకా హాజరవుతారని అంచనా. అంతకు మించి కూడా వస్తారని కూడా నేతలు  అంటున్నారుమొత్తానికి జనసేనలో కోలాహలం చాలా ఎక్కువగానే ఉంది. 

ఇక పవన్ కళ్యాణ్  ఫిబ్రవరి 21న నర్సాపురంలో జరిగిన  మత్స్యకార సభలో చాలా బాణాలే వేశారు. దాంతో ఏపీ సర్కార్ రివర్స్ అటాక్ చేసింది. కొద్ది రోజుల పాటు ఆ వేడి అలా సాగింది. అయితే నాడు పవన్ చాలా అంశాలను కావాలనే  ప్రస్థావించలేదు. వాటిని ఆయన వ్యూహాత్మకంగానే దాచి ఉంచారట.సరైన సమయం సరైన వేదిక మీద నుంచే ఆయన వాటిని గురి చూసి మరీ వదులుతారు అని నాడు ప్రచారం జరిగింది. సరిగ్గా ఆ టైమ్ ఇపుడు వచ్చేస్తోంది.

జనసేనాని ఆవిర్భావ సభ ద్వారా ఒక రేంజిలోనే అధికార వైసీపీ మీద చెలరేగిపోతారు అంటున్నారు. ఇపుడు ఆయన వద్ద చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కోదానిని ఆయన తూటాల మాదిరిగా గురి చూసి పేల్చితే వైసీపీ శిబిరం కకావికలం అవుతుంది అంటున్నారు.బాబాయ్ హత్య నుంచి మొదలుపెట్టి ఏపీలో టికెట్ల వ్యవహారంలో సాగించిన రాజకీయ కక్ష తమ ప్రత్యర్ధుల మీద వైసీపీ  అధికార బలం ప్రయోగిస్తున్న ఉదంతాలతో పాటు మూడు రాజధానుల మీద ఇంకా మొండితనంతో ముందుకు పోతామంటున్న వైసీపీ వైఖరిని కూడా పవన్ ఎండగడతారు అని తెలుస్తోంది. 

ఈసారి పవర్ స్పీచ్ పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు.ఈ స్పీచ్ తో పవన్ రాజకీయ లక్ష్యాలు భవిష్యత్తు ప్రణాళికలు వైసీపీ విషయంలో తాడో పేడో తేల్చేసే వైఖరి అన్నీ కూడా కలగలసి ఉంటాయని అంటున్నారు. మూడేళ్ళ వైసీపీ పాలన మీద ఒక విధంగా జనసేన సిసలైన రివ్యూలా పవన్ స్పీచ్ ఉంటుందని కూడా అంటున్నారు.

అలాగే వైసీపీ అధినాయకత్వం నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతల వైఖరి మీద కూడా పవన్ మార్క్ పంచులు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పే సభగానే జనసేన వార్షికోత్సవాలను అంతా చూస్తున్నారు.