డబుల్ బొనాంజా ఇవ్వనున్న భీమ్లా నాయక్..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి
నటించిన లేటేస్ట్ చిత్రం భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చేశారు మేకర్స్. త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్.. పవర్ స్టార్ యాక్షన్ సీన్లకు రికార్డులు బద్దలయ్యాయి.. 

విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పుడు భీమ్లా నాయక్ ఓటీటీలో సందడి చేయనుంది. ఈసారి డిజిటల్ ప్రేక్షకులకు డబుల్ బొనాంజా ఇవ్వనున్నారు భీమ్లా నాయక్ మేకర్స్. ఒకటి కాదు.. రెండు ఓటీటీ ప్లాట్ ఫాంలలో ఒకేరోజున స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారింగా ప్రకటించారు.

మలయాళం సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్‏గా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏తోపాటు.. ఆహాలో మార్చి 25న స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలో సందడి చేయనున్నాడు భీమ్లా నాయక్. ఇక అదే రోజున ప్రపంచవ్యాప్తంగా జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ సైతం థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించగా.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించారు.