జనసేన మీటింగ్ కు బండ్ల గణేష్

 


పవన్ సినిమాకు సంబంధించి ఏదన్నా సినిమా
మీటింగ్ అయితే పవన్ తోపాటు బండ్ల గణేష్ స్పీచ్ కోసం కూడా ఆ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. లాస్ట్ టైం ‘భీమ్లానాయక్’ వేడుకలో బండ్ల స్పీచ్ ను చాలా మందే మిస్సయ్యారు. కానీ ఈసారి మాత్రం మొత్తానికి పవన్ మీటింగ్ లో తానూ కనిపిస్తానని తాజాగా కన్ఫమ్ చేశాడు. 

మార్చి 14న పవన్ తన పార్టీ జనసేన ఆవిర్భావ దినోత్సవ భారీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సభకు తాను కూడా వస్తున్నానని బండ్ల గణేష్ కన్ఫర్మ్ చేశారు. ఈ మీటింగ్లో కేవలంగా అభిమానిగా వెళ్తున్నాడా? లేక స్టేజీ ఎక్కి పవన్ ఫ్యాన్స్ మిస్ అవుతున్న మాస్ స్పీచ్ ను దంచి కొట్టి దుమారం రేపుతాడా? అన్నది చూడాలి.
ఈ క్రమంలోనే బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పవన్ ‘చలో అమరావతి’ పోస్టర్ ను రిలీజ్ చేసిన బండ్ల గణేష్ ఈ మేరకు ‘‘వీరులారా ధీరులారాజన సేన సైనికులారా !! రండి కదలి రండి   కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను.
మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం కలిసి పోరాడదాం’’ అంటూ ట్వీట్ చేశాడు. వైరల్ చేశారు. దీంతో బండ్ల కూడా ఈ సభలో పాల్గొని దుమారం రేపబోతున్నాడని అర్థమవుతోంది.