ఘోర విమాన ప్రమాదం133 మంది ప్రయాణికుల దుర్మరణం..


చైనా లో విమానం కుప్పకూలింది. ప్ర
మాదం జరిగిన సమయంలో దాదాపు 133 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. విమానం కొండల్లో కుప్పకూలి పోవడంతో పెద్ద సంఖ్యలో మరణించి ఉంటారని తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. చైనాకు చెందిన బోయింగ్ 737 కుప్పకూలిందని అధికారులు ధృవీకరించారు. 

దక్షిణ చైనా గ్వాంగ్ జియాంగ్ ప్రాంతంలో కుప్పకూలిందని వెల్లడించారు.విమానం కుప్ప కూలిన సమయంలో పెద్దయెత్తున పొగతో పాటు మంటలు కూడా వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పర్వత ప్రాంతంలో కూలిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అని అధికారులు తెలిపారు. ఎట్టకేలకు సహాయక కార్యక్రమాలను చేపట్టారు అధికారులు. విమానం తీవ్రంగా ఉండటంతో 133 మంది ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు.


ఈ ప్రమాదానికి గల కారణాలు తె
లియాల్సి ఉంది. ప్రమాదం ఎందుకు జరిగింది? కారణాలేంటి? మరణాల సంఖ్య ఎంత అనేది తెలియరాలేదు. కానీ ప్రాధమిక సమాచారం ప్రకారం 133 మంది ప్రయాణికులు చనిపోయినట్లుగా సమాచారం. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం 737 ప్యాసింజర్ విమానం MU5735 కున్మింగ్ నుండి గ్వాంగ్జౌకు దక్షిణ చైనాలోని గ్వాంగ్జి ప్రావిన్స్‌లో కూలిపోయింది.