కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఈరోజు ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ రాత్రి 8 నుండి 10 గంటల వరకు సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారుప్రిల్ 19న పుష్పయాగం జరుగతుందన్నారు. ఇందుకోసం చేపట్టవలసిన ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణ, షెడ్లు, తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
స్వామివారి కల్యాణానికి వచ్చే భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్, పోలీస్ విభాగం వారితో సమన్వయం చేసుకొని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి తెలిపారు.