వివేకా కేసులో కొత్త అనుమానం


మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పై అనుమానాలు పెరుగుతున్నాయి.ఈ కేసులో ఎందుకు ఇంత స్లోగా విచారణ సాగుతుందో అర్థం కాని పరిస్థితి.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిపై శుక్రవారం సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శివశంకర్ రెడ్డి ఇప్పటికే కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కడప జిల్లా పులివెందుల కోర్టులో అతనిపై సీబీఐ అధికారులు చార్జిషీట్ వేశారు. వివేకా హత్య కేసులో శివ శంకర్ రెడ్డి 5వ నిందితుడు అని  చార్జిషీట్లో రాశారు.అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే… వై ఎస్ వివేకా హత్య కేసులో నిందితులుగా పేర్కొన్న దస్తగిరి వాగ్మూలం ప్రకారం దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేయలేయడం లేదు ఎందుకు అని అందరూ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఒక వాంగ్మూలంలో కొందరిని అరెస్టు చేసి మరికొందరిని వదిలేయడం పై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ కేసును జగన్ రెడ్డి ఏమైనా ప్రభావితం చేస్తున్నారా? అని తెలుగుదేశం పార్టీ అనుమానాలు వ్యక్తంచేస్తోంది.