సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో స్కిల్ డవలప్ మెంట్ ప్రోగ్రామ్

 


గిజన యువకులు సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే స్కిల్ డవలప్ మెంట్ ప్రోగ్రామ్ ను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్యా రాస్తోగి పేర్కొన్నారు. సీఆర్పిఎఫ్ 42 బెటాలియన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన 40 మంది యువకులకు డ్రైవింగ్ లో 21 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని గురువారం రాజమహేంద్రవరం లాలా చెరువు లోని సీఆర్పిఎఫ్ 42 బెటాలియన్ ప్రాంగణంలో అర్బన్ జిల్లా ఎస్పీ   ఐశ్వర్యా రాస్తాగి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి  మాట్లాడుతూ  సీఆర్పీఎఫ్  42, బెటాలియన్, ఎస్.బి మోటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్కిల్ డవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా 21 రోజులు డ్రైవింగ్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం భవిషత్ లో  గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు పొందేందుకు దోహదపడుతుందని   అన్నారు. 

సీఆర్పీఎఫ్ 42 బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన యువకులకు స్కిల్ డవలప్ మెట్  లో భాగంగా కారు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ వలన యువకులు అసాంఘిక కార్యకలాపాల వైపు,  మావోయిస్టుల  వైపు మోగ్గు చూపకుండా ఉపాధి అవకాశాలు పెంపొందించుకొని  జీవనోపాధి పొందేందుకు దోహద పడుతుందని అన్నారు. గత రెండు సంవత్సరాలు గా కోవిడ్ వలన స్కిల్ డవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించాలేదని అన్నారు. శిక్షణ అనంతరం బ్యాంక్ ద్వారా లోన్లు మంజూరు చేసిన వాహనాలు కొనుగోలు చేసి యువకులకు ఇచ్చేందుకు సహకరిస్తామన్నారు. సీఆర్పీఎఫ్ లో శిక్షణ పొందడం వలన యువకులలో నైపుణ్యం లభించడం తో పాటు క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఓ ప్రవీణ్ అదిత్య, ఎస్.ఎఫ్.ఎస్ ఆసిసెంట్ కన్వసర్వర్ ఎం.వి.ప్రసాదరావు, సెకండెంట్ కమాండెంట్ జి. సీతల్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ బి. రత్నమ్మ, స్టేట్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్. సురేష్ ప్రభు, మారుతి సుజికీ జనరల్ మేనేజర్ ఎం.వి.ఎస్.ఎస్.ఆర్ గుప్తా తదితరులు పాల్గ్కొన్నారు.