ఆయిల్ ధరలను మరింత తగ్గించడానికి,హోర్డింగ్‌ను అరికట్టడానికి కేంద్రం శుక్రవారం వంటనూనెలు, నూనెగింజలపై స్టాక్ పరిమితిని జూన్ 30 వరకు పొడిగించింది. ఇది కాకుండా, స్టాక్ హోల్డింగ్ పరిమితులపై మునుపటి ఆర్డర్‌ను అమలు చేయని రాష్ట్రాలు విధించాల్సిన స్టాక్ పరిమితులను కూడా ప్రభుత్వం పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లలో కూడా ధరలు పెరిగాయి. గత సంవత్సరం, ప్రభుత్వం ధరల నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంది. దీని కారణంగా వంట నూనెల ధరలలో కొంత తగ్గుదల కనిపించింది. సరఫరా పెరుగుదలతో ధరలు మరింత తగ్గాలని ప్రభుత్వం భావిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెకు అధిక ధరలు ఉండడంతో దేశీయంగా నూనె ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయని ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. నూనెల వంటి నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేలా చూడడానికి ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని కలిగి ఉందని చెప్పింది. దిగుమతి సుంకం హేతుబద్ధీకరణతోపాటు వ్యాపారుల వద్ద ఉన్న స్టాక్ స్వీయ-బహిర్గతం కోసం వెబ్-పోర్టల్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
నూనె ధరల తగ్గిపునకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల నిల్వలపై పరిమితిని విధించాలని గత ఏడాది ఆదేశించింది. చట్టపరమైన సంస్థలు ఏవైనా పరిమితికి మించి నిల్వలను కలిగి ఉంటే.. ఆ వివరాలను ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్‌లో పొందుపరచాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు నూనెలు, నూనె గింజల పరిమిమతుల వివరాలను కేంద్రప్రభుత్వం వెబ్సైట్లో అప్డేట్ చేయాలని కోరింది.