జగన్ సర్కార్ భీమ్లా నాయక్ సినిమాపై విధించిన అంక్షలపై వ్యతిరేకత పెరుగుతుంది.ఫ్యాన్స్ షో,5 షోలు ఇవ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లా కడియంలో అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.ఈ నేపధ్యంలో ఉద్రిక్తత ఏర్పడిరది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం విడుదలకానుంది. అయితే కడియంలో ఫ్యాన్స్ షో కి అనుమతి ఇవ్వలేదు.
5 షోలు వేసేందుకు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో కడియంలో గురువారం రాత్రి అభిమానులు ధర్నాకు దిగారు.పోలీసులు చెప్పినా వారు వినలేదు. తమ డబ్బులతో తాము సినిమా చూస్తే మీకేమిటి నష్టం అంటూ వాదనకు దిగారు. ఇదే నిబంధనలు బంగార్రాజు సినిమాకు ఎందుకు పెట్టలేదు అంటూ ఘర్షణకు దిగారు. ప్రస్తుతం కడియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.