పుల్వామా ఉగ్రదాడి ఘటనకు నేటితో మూడేళ్లు పూర్తైయ్యాయి. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సైనికులకు ప్రధాని మోదీ సహా దేశ ప్రజలు సోమవారం నివాళి అర్పించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ “2019లో ఈ రోజున పుల్వామాలో అమరులైన వారందరికీ నేను నివాళులర్పిస్తున్నాను మరియు మన దేశానికి వారు చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటున్నాను.
వారి శౌర్యం మరియు అత్యున్నత త్యాగం ప్రతి భారతీయుడిని బలమైన మరియు సంపన్న దేశం కోసం పని చేయడానికి ప్రేరేపిస్తుంది” అని పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో సైనిక బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన బాంబుదాడిలో 40 మంది భారత వీర సైనికులు అమరులయ్యారు