టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. దాదాపుగా గంట నుంచి రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో టిక్కెట్ రేట్ల దగ్గర్నుంచి సినిమా రంగసమస్యలన్నింటిపై చర్చించినట్లుగా తెలుస్తోంది. సమస్యలన్నింటిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన వారందరూ సమస్య పరిష్కారం అయిందని.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారుటాలీవుడ్ సమస్యలకు శుభం కార్డు పడిందని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయని చిరంజీవి ప్రకటించారు. చిన్న సినిమాలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ చర్చలు జరిపారని.. చిన్న సినిమాలకు ఐదో షోకు అంగీకారం తెలిపారని చిరంజీవి తెలిపారు. జగన్‌తో చర్చలు సంతృప్తికరంగా సాగాయన్నారు. చిన్న సినిమాలకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఇండస్ట్రీ సమస్యలపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నరని అండగా ఉంటామని హమీ ఇచ్చారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపతున్నామన్నారు. టిక్కెట్ ధరలపై కొన్ని నెలలుగా ఉన్న అనిశ్చితికి తెరపడినట్లేనన్నారు. తెలంగాణలోలా ఏపీలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనేది సీఎం ఆకాంక్ష అన్నారు. పాన్ ఇండియా సినిమాల విడుదల సమయంలో ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారని చిరంజీవి తెలిపారు. మూడో వారంలో జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
హామీలు నెరవేరుస్తామన్నారు. ధ్యాంక్స్ మహేష్
సినిమా ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం జగన్ అన్నారని ... ప్రభుత్వ స్పందనకు మహేష్ బాబు ధ్యాంక్స్ చెప్పారు. పది రోజుల్లోనే శుభవార్త వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఆరు నెలల నుంచి ఇండస్ట్రీ గందరగోళంలో ఉందని.. ఇవాళ చాలా రిలీఫ్ .. వెరీ హ్యాపీ.. చర్చలు బాగా జరిగాి.. ధ్యాంక్స్ అన్నారు. మా అందరి తరపున చిరంజీవికి కూడా ధ్యాంక్స్ అని మహేష్ చెప్పారు.