పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా భీమ్లానాయక్. దగ్గుబాటి రానా, పవన్ కలయికలో మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ(23 ఫిబ్రవరి 2022) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది చిత్రయూనిట్. సోమవారమే(ఫిబ్రవరి 21న) ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో వాయిదా పడింది. ఈరోజు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ విషయంలో ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చారు. భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా ఈరోజు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు.
సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుండగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు యూసుఫ్‌గూడ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అమీర్‌పేట, మైత్రివనం నుంచి వచ్చే వాహనాలు యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు.