నిధుల్లేవ్‌.. సర్పంచ్‌ విధుల్లో కోత పేరుకే పంచాయతీలు!

సర్పంచ్‌ విధుల్లోనూ కోత పెట్టారు. పేరుకే పంచాయల తరబడి బిల్లుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి. ఇక సర్పంచ్‌లకు ఉన్న అరకొర విధులను సచివాలయ ఉద్యోగులకు కట్టబెట్టేసింది. దీంతో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారారు. పేరుకు పదవిలో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో 2018 ఆగస్టు 1 నుంచి 2021 ఏప్రిల్‌ 2 వరకు సర్పంచ్‌లు అధికారంలో లేరు. ఎన్నికలు జరగనందున 2018-2021 మధ్య కాలంలో నిధులు విడుదల చేయలేదని, పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని భావించారు. అయితే.. పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంతో అసలు విషయం వెల్లడైంది. కేంద్రం నిధులు ఇస్తున్నా పంచాయతీలకు అందడం లేదని, సర్కారు వాడుకుంటోందని విమర్శలు వచ్చాయి. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు నిధుల విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కాగా ప్రభుత్వం ఆ నిధులు జమ చేసి ఉంటే సీఎ్‌ఫఎంఎస్‌ అకౌంట్లలో ఎందుకుకనిపించడంలేదని, జీరో బ్యాలెన్స్‌ ఎందుకు చూపిస్తున్నాయని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత రూ.345కోట్లు ఒకసారి, రూ.969కోట్లు మరోసారి తమకు తెలియకుండా విద్యుత్‌ చార్జీల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందని, దీంతో సీఎ్‌ఫఎంఎస్‌ అకౌంట్లలో నిధులు ఖాళీ అయ్యాయని ఆరోపిస్తున్నారు. నిధులు దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి  ఫిర్యాదు చేశారు