వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.. అప్రూవర్‌గా మారిన డ్రైవర్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సాగుతూనే ఉంది. తాజాగా ఈకేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందు సంబంధించి సీబీఐ దర్యాప్తు స్పీడప్‌ చేసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో.. అతని వాగ్మూలాన్ని మరోసారి రికార్డ్‌ చేశారు అధికారులు. వివేకా హత్యకు సంబంధించిన సంచలన విషయాలను దస్తగిరి చెప్పినట్లు సమాచారం. దస్తగిరి ఏం చెప్పాడనేది ఉత్కంఠగా మారింది.

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది సీబీఐ. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరిని, పులివెందుల కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు. మరోసారి దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేయించారు ఆఫీసర్లు. అప్పట్లో వివేకా డ్రైవర్‌గా ఉన్న దస్తగిరి, ఈ కేసులో అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 26న దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతిచ్చింది. గతేడాది ఆగస్ట్‌ 31న ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. వివేకా హత్యకు సంబంధించిన సంచలన విషయాలను దస్తగిరి చెప్పినట్లు సమాచారం.వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్ర గంగిరెడ్డి 40 కోట్లు ఇస్తాడని, ఉమాశంకర్‌రెడ్డి తనకు చెప్పినట్టు వెల్లడించాడు దస్తగిరి. ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు, దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు. వివేకా హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు దస్తగిరి. అటు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిల పిటిషన్లను ఇటీవల హైకోర్టు కొట్టేసింది. దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అప్రూవర్‌గా మారుతున్నట్టు దస్తగిరి ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు వేసిన పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడంలో సీబీఐ దురుద్దేశంతో వ్యవహరించిందన్న పిటిషనర్ల తరఫు వాదనలను తోసిపుచ్చింది.