నరసాపురంలో జనసేన బహిరంగ సభ


 తమ నాయకుడు,జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ తలపెట్టిన మత్స్యకార అభ్యున్నతి సభ గత సంవత్సరం నవంబర్‌ 20 వ తేదీన జరగాల్సి ఉండగా కోవిడ్‌ కారణంగా వాయిదా పడిరదని జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌ తెలిపారు.
శనివారం స్థానిక విద్యుత్‌ నగర్‌ చల్లా కళ్యాణ మండపంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం జరిగింది. ఈసందర్భంగా దుర్గేష్‌, పిఏసి సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్‌, పితాని బాలకృష్ణ,మాకినీడి శేషుకుమారి, శెట్టిబత్తుల రాజబాబు,మరియు నియోజకవర్గ ఇంచార్జ్‌ లతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 20న నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభ జరుగుతుందని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌ వెల్లడిరచారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ నాయకుడికి ప్రత్యేకమైన అవగాహన ఉందని,దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 13 వ తేదీన తమ పార్టీ పిఏసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, నానాజీ ఆధ్వర్యంలో    కాకినాడ రూరల్‌ నియోజకవర్గం సుర్యరావు పేట నుండి మొదలు పెట్టి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వారికి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఏ విధమైన భరోసా కల్పిస్తారో వివరిస్తారన్నారు.