మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’ హిందీలో కూడా రిలీజ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న లేటెస్ట్ మల్టీస్టారర్
మూవీ ‘భీమ్లా నాయక్’ హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ కన్ఫర్మ్ చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘భీమ్లా నాయక్’ హిందీలోనూ విడుదల అవుతుందని తెలిపారు. ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలను అందిస్తున్నారు. ఇక అందరూ ఈ సినిమా విడుదల తేదీ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ మూవీ నిర్మాతలు కూడా సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించారు. చూడాలి మరి ఫైనల్‌గా ఏ డేట్‌ను మేకర్స్ లాక్ చేస్తారో.