పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా `భీమ్లా నాయక్` ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలు పెరిగిపోగా.. సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 25న సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ ధరలకు సంబంధించిన జీవోని సవరించాలని భావిస్తుండగా, రాత్రి కర్ఫ్యూలు కూడా ఎత్తేశారు. దీంతో ‘భీమ్లా నాయక్’ని ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ‘భీమ్లా నాయక్’కు సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ మాటలు
నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా చేస్తుండగా సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించాడు.
భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫిబ్రవరి 25
February 16, 2022