డైరెక్టర్, SEB, విజయవాడ వారి ఆదేశాల23.1.22వ తేదీన భీమవరంలో SEB భీమవరం వారి దాడుల్లో సింగుదాసు రిత్విక్ అనే వ్యక్తిని LSD స్టాంప్స్-5, MDMA (మెతాంఫెటమైన్) అనే మత్తు మందు ఒక (1) గ్రాము, ఎక్స్టసీ టాబ్లెట్స్ ౼ 5 మరియు 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని క్రైం. నెం. 13/2022లో కేసు నమోదు చేసి 24వ తేదీన అతనిని రిమాండుకి పంపించి దర్యాప్తు కొనసాగించామనీ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ భీమవరం వి.వి.వి.ఎస్.ఎన్.వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అదే కేసులో 25వ తేదీన బెంగులూరుకి చెందిన మహ్మద్ సాహల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకి పంపించామనీ తెలిపారు
. సాహల్ ఇచ్చిన సమాచారం మేరకు 27వ తేదీన బెంగులూరు వెళ్లి తూర్పు బెంగులూరు తాలూకా, బిదరహళ్లి హోబ్లి మండలం ఆదూర్ గ్రామంలో నివాసం ఉంటున్న *పీటర్ వాజకో చిన్వూబా (PETER NWAJAKO CHINWEUBA) లోకి* అనే పేరు గల నైజీరియా దేశానికి చెందిన 32 సంవత్సరాల యువకుడిని అరెస్టు చేసి 28 వ తేదీన బెంగులూరు కోర్టులో హాజరు పరచి *ట్రాన్సిట్ వారంట్* తీసుకొని నేడు I AJFCM కోర్టు, భీమవరం వారి ముందు హాజరు పరచగా ముద్దాయికి రిమాండు విధించారు. సదరు ముద్దాయిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేస్తున్నాట్లు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ భీమవరం వి.వి.వి.ఎస్.ఎన్.వర్మ తెలిపారు.