తాజాగా చోటు చేసుకున్న ఒక హత్య ఉదంతం దారుణంగా మారింది. హత్యకు గురైన వ్యక్తి తెలంగాణ అధికార పక్షానికిచెందిన మండల స్థాయి నేత కావటం కలకలంగా మారింది. హైదరాబాద్ మహానగర శివారులో చోటు చేసుకున్న ఈ హత్య ఉందంతం వెనుక భూ వివాదంగా భావిస్తున్నారు. బిహెచ్ఈఎల్ కు కాస్త దూరంలో ఉండే రామచంద్రాపురం వెలిమెల తండాకు చెందిన 32 ఏళ్ల కేడావత్ రాజు నాయక్ దారుణంగా హత్యకు గురయ్యాడు.టీఆర్ఎస్ మండల ఎస్టీ విభాగానికి అధ్యక్షుడిగా పని చేస్తున్న ఇతడ్ని దారుణంగా హత్య చేసి.. తల ఒక చోట.. మొండం మరొక చోట పడేయటం షాకింగ్ గా మారింది. ఈ హత్యకు 32 గుంటల భూమి వివాదమే కారణమని భావిస్తున్నారు. ఈ హత్య ఉదంతంలో భాగంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో హత్యకు గురైన రాజు నాయక్ సోదరుడు కూడా ఉండటం గమనార్హం.
ఈ నెల25న రాత్రి వేళలో రాజు నాయక్ కు ఒక ఫోన్ కాల్ వచ్చిందని.. దీంతో పని ఉందని కారులో బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. దీంతో..అతడి మిస్సింగ్ పైన రాజు నాయక్ సోదరుడు గోపాల్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతోరంగంలోకి దిగిన పోలీసులు రాజు నాయక్ డెడ్ బాడీలోని తలను ఒకచోట.. మొండాన్ని మరోచోట గుర్తించారు.
రాయికోడ్ మండలం కుస్నూర్ శివారులోని వాగు వద్ద తల.. న్యాల్ కల్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులోని మంజీరా బ్రిడ్జి వద్ద మొండాన్ని గుర్తించారు. ఈ రెండింటిని కలిపి పోస్టు మార్టమ్ కోసం పంపారు. మరణించిన రాజు నాయక్ ఎర్రమట్టి వ్యాపారం చేస్తుండాని చెబుతున్నారు. ఈ హత్య కేసులో బాధితుడి సోదరుడితో పాటు.. మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.