1. మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 (Micromax In Note 2) సేల్ ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ యాపిల్ ఐఫోన్ 13 (iPhone 13) లాగా ఉండటం విశేషం. కెమెరా మాడ్యూల్ డిజైన్ సాంసంగ్ గెలాక్సీ ఎస్21 (Samsung Galaxy S21) మోడల్‌ను తలపిస్తుంది. ఈ రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల డిజైన్ మిక్స్ చేసి మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ.
2. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,490 మాత్రమే. ఇందులో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల రిలీజ్ అయిన రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్‌తో పాటు త్వరలో రిలీజ్ కానున్న రెడ్‌మీ నోట్ 11ఎస్ మోడల్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
3. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది. ఇంట్రడక్టరీ ధర రూ.12,490 మాత్రమే. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో మాత్రమే లభిస్తుంది.
4. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల పుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్, జంక్ వేర్ ఉండదు.
5. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. త్వరలో ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ లభించనుంది. ఇందులో డ్యూయెల్ సిమ్ సెటప్ ఉంటుంది. మెమొరీ పెంచుకోవడానికి మైక్రోఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉండటం విశేషం. 256జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఓక్, బ్లాక్ కలర్స్‌లో.
6. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా విషయానికి వస్తే ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ Samsung GM1 ISOCELL ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా వెనుకవైపు ఉన్నాయి. నైట్ మోడ్, ఏఐ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
7. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 25 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చు.