గొలుగొండ బస్ షెల్టర్ కూల్చివేత పరిశీలిస్తున్న ఎంపీడీవో ఎస్సై కృష్ణారావు గ్రామ సర్పంచ్ అప్పారావు


 అర్ధరాత్రి గొలుగొండలో బస్సు షెల్టర్ కూల్చిన అగంతకులు.

పరిశీలిస్తున్న ఎం పి డి ఓ మరియు ఎస్సై కృష్ణారావు

 ప్రభుత్వ ఆస్తులకే రక్షణ కరువైన వేళ

 అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గొలుగొండ పంచాయతీలో బస్సు సెంటర్ ని అర్ధరాత్రి కూల్చివేసిన దుండగులు బస్సు సెంటర్ అనుకొని ఆర్చి &బి స్థలాలలో చిన్న చిన్న వ్యాపారాలు నిమిత్తం షాపులు వెలుస్తూ వచ్చాయి. ఇదిలా ఉండగా గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చే రోగులు గాని సిబ్బందికి గాని ఊరటను ఇచ్చే స్థలంగా ఉండేటువంటి బస్సు షెల్టర్ రాత్రికి రాత్రే ధ్వంసం అయింది. ఇది భూకబ్జా దారులు చేసిన పనా? లేక దానంతట అదే ధ్వంసం అయినదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ స్థలాలకే రక్షణ కరువైతున్నప్పుడు చిన్న చితక మద్య కారుల ఆస్తులు గాని భూముల పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తేనే ఒళ్ళు గగుర్పాటు వస్తున్న పరిస్థితి గొలుగొండలో చోటు చేసుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ ఘటనపై తగు చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ అకృత్యానికి దోహద పడినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోటార?లేదా? అని పలువురులో చర్చనీయాంశంగా మారింది .